కొత్తగూడెం, సెప్టెంబర్ 10 : దొరల పెత్తనానికి ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి ప్రేరణ అని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక శేషగిరిభవన్లో బుధవారం చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఐలమ్మ చిత్రపఠానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాటి భూసామ్య వ్యవస్థ, కట్టుబాట్లు, సామాజిక పరిస్థితులపై స్పందించిన ఆమె పెత్తందారి వ్యవస్థపై పోరాటానికి నాందిపలికి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందన్నారు.
వెనుకబడిన సమాజానికి వెలుగురేఖ, చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, ఎస్ కె ఫహీమ్, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, కె.రత్నకుమారి, మామిడాల ధనలక్ష్మి, నేరెళ్ల రమేశ్, ఎస్ విజయలక్ష్మి, నాయకులు శాపావట్ రవి, ఎస్ కె ఖయూమ్, కె.రామకృష్ణ, బాజాజు రవి, వినయ్, సోమయ్య, జహీర్ పాల్గొన్నారు.