మధిర, సెప్టెంబర్ 10 : పిడుగుపాటుకు రైతు మృతి చెందిన సంఘటన మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లిలో బుధవారం జరిగింది. మడుపల్లికి చెందిన గడిపూడి వీరభద్రరావు (56) తన పొలంలో నాలుగు రోజుల క్రితం మిర్చి మొక్కలను నాటాడు. అరకతో వేరే వ్యక్తి ద్వారా మిర్చి తోటలో పనులు చేయిస్తున్నాడు. ఆ క్రమంలో ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో పెద్ద శబ్దంతో పిడుగు పడింది. రైతు వీరభద్రరావు పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతి చెందాడు. అరక దున్నుతున్న వ్యవసాయ కూలీ షాక్ గురికావడంతో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరభద్రరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.