Kothugudem : చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి ప్రేరణ : సాబీర్ పాషా
దొరల పెత్తనానికి ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి ప్రేరణ అని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక శేషగిరిభవన్లో బుధవారం చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
కొత్తగూడెం, సెప్టెంబర్ 10 : దొరల పెత్తనానికి ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి ప్రేరణ అని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక శేషగిరిభవన్లో బుధవారం చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఐలమ్మ చిత్రపఠానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాటి భూసామ్య వ్యవస్థ, కట్టుబాట్లు, సామాజిక పరిస్థితులపై స్పందించిన ఆమె పెత్తందారి వ్యవస్థపై పోరాటానికి నాందిపలికి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందన్నారు.
వెనుకబడిన సమాజానికి వెలుగురేఖ, చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, ఎస్ కె ఫహీమ్, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, కె.రత్నకుమారి, మామిడాల ధనలక్ష్మి, నేరెళ్ల రమేశ్, ఎస్ విజయలక్ష్మి, నాయకులు శాపావట్ రవి, ఎస్ కె ఖయూమ్, కె.రామకృష్ణ, బాజాజు రవి, వినయ్, సోమయ్య, జహీర్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

