వాహనాల వేగంపై పరిమితులు విధించిన కేంద్రం
వాహనాల వేగంపై పరిమితులు విధించిన కేంద్రం | దేశ రాజధానిలో వాహనాల వేగానికి కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేసింది. వాహనాలు వేగంగా వెళ్లకుండా ఆయా మార్గాల్లో పరిమితులు విధించింది.

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వాహనాల వేగానికి కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేసింది. వాహనాలు వేగంగా వెళ్లకుండా ఆయా మార్గాల్లో పరిమితులు విధించింది. పరిమితికి మించి వేగంగా నడిపితే భారీగా జరిమానాలు విధించనున్నారు. ఢిల్లీలో చాలా రోడ్లపై కారు గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా వేగ పరిమితిని నిర్ణయించింది. ద్విచక్ర వాహనాలకు గంటకు 50-60, నివాస.. వాణిజ్య మార్కెట్ల లోపల అన్ని రోడ్లపై కార్లు, బైకులు గరిష్ఠ వేగ పరిమితి గంటకు 30 కిలోమీటర్లుగా నిర్ణయించింది.
బస్సులు, టెంపోలు, మూడు చక్రాల వాహనాల గరిష్ఠ పరిమితిని గంటకు 40 కిలోమీటర్లుగా ప్రభుత్వం నిర్ణయించగా.. ఈ మేరకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎన్డీ (ఢిల్లీ నోయిడా డైరెక్ట్)లో కార్ల వేగ పరిమితిని గంటకు 70 కి.మీ, ద్విచక్ర వాహనాల స్పీడ్ 60 కి.మీ, బార్పులా ఫ్లై ఓవర్లో కార్లు, ద్విచక్ర వాహనాల గరిష్ఠ వేగాన్ని గంటకు 60 కిలోమీటర్లుగా నిర్ణయించింది.
ఢిల్లీ నుంచి నోయిడా టోల్ వరకు వేగ పరిమితిని కార్లకు 70 కి.మీ, ద్విచక్ర వాహనాలకు 60 కి.మీ, రింగ్‌రోడ్ నుంచి చాంగ్డి రా చౌక్ వరకు కారు, బైకుల వేగం గరిష్ఠంగా 50 కి.మీ, విమానాశ్రయంలో రోడ్లో కార్లు, బైకుల వేగం పరిమితిని 60 కిలోమీటర్లుగా నిర్ణయించింది. పరిమితికి మించి వాహనాలు నడిపితే భారీగా జరిమానాలు విధించనున్నారు. ఈ మేరకు వాహనాల డ్రైవర్లు జాగ్రత్తగా నడుపాలని సూచించింది.
ఇవి కూడా చదవండి..
‘కొవిషీల్డ్’ గ్యాప్ తగ్గింపు!
కరోనా స్పెషల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!
నేటి నుంచి జీ-7 శిఖరాగ్ర సమావేశాలు..
అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం
జమ్మూకాశ్మీర్‌లో అగ్ని ప్రమాదం.. 20 ఇండ్లు దగ్ధం
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో 24 గంటల్లో 91,702 కరోనా కేసులు
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం : ఐఎండీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

