‘కొవిషీల్డ్’ గ్యాప్ తగ్గింపు!
- విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, క్రీడాకారులకు 28 రోజులకే:కేంద్రం

న్యూఢిల్లీ, జూన్ 10: కరోనా కట్టడిలో భాగంగా ఇస్తున్న ‘కొవిషీల్డ్’ టీకా రెండు డోసుల మధ్య ఎడం 12-16 వారాలుగా కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. కొన్ని వర్గాల ప్రజలకు ఈ వ్యవధిని తగ్గిస్తూ నిబంధనల్లో కేంద్రం కొన్ని సవరణలు చేసింది. చదువుల కోసం తమ దేశానికి వచ్చే విద్యార్థులు, ఇంకా ఉద్యోగులు, క్రీడాకారులకు పలు దేశాలు వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా వ్యక్తులకు రెండో డోసు విషయంలో గడువును తగ్గించింది.
తాజా మార్గదర్శకాలు
- విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్లే విద్యార్థులు, విదేశాల్లో ఉద్యోగావకాశం వచ్చిన వారు, క్రీడాకారులు, టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే సిబ్బందికి 84 రోజుల కంటే ముందుగానే ‘కొవిషీల్డ్’ రెండో డోసు వేసుకోవచ్చు.
- ఈ మూడు గ్రూపులవారి వివరాలను సమీక్షించి, అనుమతులు ఇచ్చేందుకు ప్రతిజిల్లాలో అధికారులను ఆయా రాష్ర్టాలు ఏర్పాటుచేయాలి.
- మొదటి, రెండోడోసుకు మధ్య ఎడం కనీసం 28 రోజులు ఉండాలి.
- ఈ గ్రూపులోని వ్యక్తులు తొలి డోసు తీసుకొని 28 రోజులు పూర్తయిందా? విదేశీ ప్రయాణానికి వారు సమర్పిస్తున్న పత్రాలు సరైనవా? తదితర వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలి.
- ఆగస్టు 31లోపు అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఆస్ట్రాజెనెకా టీకాతో ప్లెట్లెట్ల రిస్క్!
లండన్, జూన్ 10: ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ (భారత్‌లో కొవిషీల్డ్) వేసుకున్న వారి రక్తంలో ప్లెట్లెట్ల సంఖ్య తగ్గడాన్ని గుర్తించినట్టు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ పరిశోధకులు తెలిపారు. అయితే, ప్రతి 10 లక్షల మందిలో కేవలం 11 మందిలోనే దీన్ని గుర్తించినట్టు పేర్కొన్నారు. రక్తంలో ప్లెట్లెట్ల సంఖ్య తగ్గడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, రక్తస్రావం వంటి సమస్యలు ఏర్పడవచ్చని వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- Covishield
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

