Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Sridhar Vembu | ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ జోహో (Zoho) వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు (Sridhar Vembu) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) రంగంలో ప్రస్తుత పెట్టుబడుల వాతావరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 'ఏఐ'లో కనిపిస్తున్నది బూమ్ (Boom) కాదని, అదొక బబుల్ (Bubble) అని అన్నారు.
Sridhar Vembu : ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ జోహో (Zoho) వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు (Sridhar Vembu) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) రంగంలో ప్రస్తుత పెట్టుబడుల వాతావరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ‘ఏఐ’లో కనిపిస్తున్నది బూమ్ (Boom) కాదని, అదొక బబుల్ (Bubble) అని అన్నారు. ఈ కారణంగా తమ సంస్థ భారీ మౌలిక సదుపాయాలపై ఇప్పుడే పెట్టుబడులు పెట్టబోదని ఆయన స్పష్టంచేశారు.
అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్ చమత్ పాలిహపిటియ ‘ఎక్స్’లో చేసిన ఒక పోస్టుకు శ్రీధర్ వెంబు బదులిచ్చారు. ఏఐ కంపెనీల ఆదాయ నాణ్యతను చామత్ తన పోస్టులో ప్రశ్నించారు. ప్రస్తుతం ఏఐపై ఖర్చు చేస్తున్న వాటిలో అధిక శాతం నష్టాల్లో ఉన్న, వెంచర్ క్యాపిటల్ నిధులతో నడిచే కంపెనీలేనని ఆయన వాదించారు. ఈ నేపథ్యంలో వెంబు తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. సాధారణంగా మేం ఇతరుల డబ్బుతో భారీ వ్యాపారాలు చేసే పద్ధతికి దూరంగా ఉంటామన్నారు.
ఏఐలో మౌలిక పరిశోధన, అభివృద్ధి కోసం మేం పెట్టుబడులు పెడుతున్నామని, అయితే డేటా సెంటర్లు, ప్రత్యేక హార్డ్‌వేర్ వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడానికి ఈ బుడగలాంటి వాతావరణం తగ్గేంత వరకు వేచి చూస్తామని శ్రీధర్ వెంబు తన పోస్టులో పేర్కొన్నారు. శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు ఏఐ విషయంలో జోహో భవిష్యత్ వ్యూహాన్ని స్పష్టంచేస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులు స్థిరపడే వరకు భారీ ఖర్చులు చేయకుండా ఏఐ పరిశోధన సామర్థ్యాలను పెంచుకోవడంపైనే దృష్టి సారిస్తామని ఆయన పరోక్షంగా సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

