ఖలీల్‌వాడి, జూలై 4: ఆర్మూర్‌లో చేసిన అభివృద్ధి ఏమిటని, ఇప్పటివరకు ఎన్ని నిధులు తెచ్చారో ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి చెప్పాలని, ఈ విషయంపై చర్చించడానికి ఆయన బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్వీ నాయకుడు అభిలాష్‌రెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఆయన జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయ విమర్శలు చేసే ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాలని రాకేశ్‌రెడ్డిని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించే ప్రయత్నం మానుకుని, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి భారీ మొత్తంలో నిధులు మంజూరుచేయగా, వాటితో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తుచేశారు. అధికారంలో ఉన్న వారు మాటలతో కాకుండా పనులతో ప్రజల విశ్వాసాన్ని చూరగోనాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజాసమస్యలపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఆర్మూర్ అభివృద్ధికి ఎవరు ఎన్ని నిధులు తీసుకవచ్చారో బహిరంగంగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అదే ధైర్యం రాకేశ్‌రెడ్డికి ఉంటే తేదీ, వేదిక ప్రకటించాలని అభిలాష్‌రెడ్డి సవాల్ విసిరారు.