బాగ్దాద్: బాత్రూమ్లోని కమోడ్లను కూడా కొందరు సంపన్నులు బంగారంతో తయారు చేసుకున్న ఉదంతాలు మనకు తెలుసు. కానీ ఇరాక్‌లోని ఒక ఎంపీ ఇంటిపై దాడి చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు విలువైన వజ్రాలు, బంగారం, కట్టల కట్టల డబ్బు, ఖరీదైన వస్తువులు చూసి ఆశ్చర్యపోలేదు కానీ, బంగారంతో తయారు చేసిన ఖరీదైన లో దుస్తుల జతను చూసి షాక్ తిన్నారు. దీంతో ఈ బికినీ జత సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.
తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్న ఈ మహిళా ఎంపీ అలియా నస్పీఫ్ ఇంటి నుంచి అధికారులు 1.33 కోట్ల డాలర్లు (సుమారు రూ. 148 కోట్లు) నగదు, బంగారం, నగలు, వజ్రాలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. భవనాలు, ఇతర ఆస్తులను కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం పట్టుబడిన అక్రమ ఆస్తుల విలువ 8.5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 809 కోట్లు) ఉంటుందని చెప్పారు.