చండీగఢ్: గొడవ నేపథ్యంలో పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి రమ్మని ఒప్పించేందుకు ఒక వ్యక్తి అత్త వారింటికి వెళ్లాడు. అక్కడ వాగ్వాదం జరుగడంతో బావమరిది అతడికి నిప్పంటించాడు. ఆ వ్యక్తితోపాటు కాపాడేందుకు ప్రయత్నించిన మరో మహిళ మంటల్లో కాలి మరణించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Man set on fire by brother-in-law) పంజాబ్‌లోని తరణ్ తరణ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భార్యాభర్తలైన లవ్‌ప్రీత్ సింగ్, సందీప్ కౌర్ మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో భార్య తన పుట్టింటికి వెళ్లింది.
కాగా, జూన్ 13న భార్యను ఒప్పించి ఇంటికి తిరిగి తీసుకొచ్చేందుకు సంఘా గ్రామంలోని అత్తవారింటికి లవ్‌ప్రీత్ సింగ్ వెళ్లాడు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో బావమరిది సాజన్ సింగ్ ఆగ్రహించాడు. లవ్‌ప్రీత్ సింగ్‌పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటలు అంటుకోవడంతో అతడు అక్కడి నుంచి నడిచి వెళ్లాడు.
మరోవైపు లవ్‌ప్రీత్ సింగ్‌ను కాపాడేందుకు, అతడికి అంటుకున్న మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన గుర్జీత్ కౌర్ అనే మహిళ కూడా మంటల్లో చిక్కుకున్నది. తీవ్ర కాలిన గాయాలైన వీరిద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
అయితే నిందితుడైన సాజన్ సింగ్‌కు కూడా కాలిన గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
पंजाब के तरनतारन में अपनी पत्नी को मायके से ससुराल ले जाने आए पति को उसके ही साले ने पेट्रोल डालकर आग लगा दी। इसमें व्यक्ति की मौत हो गई। उसे बचाने आई भाभी भी आग की चपेट में आई, जिससे उसकी भी जान चली गई।#punjab #tarantaran pic.twitter.com/fb7zFxzKUu
— Prince Singh- RK (@princesinghrk) July 4, 2026