Independence Day | ఎర్రకోట వద్ద వేడుకలకు వరుసగా రెండో ఏడాది డుమ్మా కొట్టిన రాహుల్ గాంధీ, ఖర్గే
Independence Day : లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతోపాటు, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎర్రకోట వద్ద శనివారం జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకలకు హాజరుకాలేదు. ఇద్దరూ ఈ వేడుకలకు హాజరుకాకపోవడం వరుసగా ఇది రెండోసారి.
Independence Day : లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతోపాటు, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎర్రకోట వద్ద శనివారం జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకలకు హాజరుకాలేదు. ఇద్దరూ ఈ వేడుకలకు హాజరుకాకపోవడం వరుసగా ఇది రెండోసారి. ఎర్రకోట వద్ద ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. 80వ ఇండిపెండెన్స్ డే వేడుకలు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగాయి. సాధారణంగా ఈ వేడుకలకు రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష నేతలు, ఇతర పార్టీల నాయకులు కూడా హాజరవుతారు. గతంలో ఖర్గే, రాహుల్ సహా అగ్రనేతలు హాజరయ్యే వారు.
కానీ, గత ఏడాది జరిగిన వేడుకలతోపాటు ఈరోజు జరిగిన వేడుకలకు కూడా ఇద్దరూ హాజరుకాకపోవడం ఆసక్తికరంగా మారింది. అధికారపక్షానికి, ప్రతిపక్షానికి మధ్య దూరం పెరిగింది అనేందుకు ఈ పరిణామం ఒక నిదర్శనం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య వైరంగా మారిన సంగతి తెలిసిందే. మోదీపై, అమిత్ షాపై రాహుల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ ఎర్రకోట వద్ద వేడుకలకు చివరిగా 2024లో హాజరయ్యారు. అప్పట్లో రాహుల్‌కు కేటాయించిన సీటుపై వివాదం నడిచింది. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీకి రెండో వరుసలో సీట్లు కేటాయించడం వివాదాస్పదంగా మారింది. ఇలాంటి వేడుకల్లో ప్రతిపక్ష నేతకు ముందు వరుసలో సీటు కేటాయించాలి. ఆ తర్వాత నుంచి వేడుకలకు ఆయన హాజరవ్వడం లేదు.
సాధారణంగా లోక్‌సభ ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ హోదా ఉంటుంది. ప్రోటోకాల్ అనుసరించాలి. అయితే, రాహుల్‌కు సీటు కేటాయింపులో ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు. దీనిపై అప్పట్లో కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఆయనను అవమానించడం అంటే, ప్రజల్ని అవమానించినట్లే అని వ్యాఖ్యానించింది. అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షం తమ పంతాలకు ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయాల్ని కాలరాస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

