హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రేవంత్ సర్కార్ క క్షపూరిత ధోరణి పరాకాష్టకు చేరింది. సోమవారం వినాయక చవితి రోజున పోలీస్ విచారణకు హాజరుకావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ, పీఆర్వోకు సైఫాబాద్ పోలీ సులు నోటీసులు ఇవ్వడమే అందు కు నిదర్శనం. ఈ నెల 7న అసెంబ్లీ మూడో గేట్ వద్ద జరిగిన ఘటనలపై కేటీఆర్ పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేశ్‌పై కేసు నమోదైంది.
వారు హైకోర్టును ఆశ్రయించడంతో మ ధ్యంతర బెయిల్ మంజూరు చేసి వి చారణకు సహకరించాలని సూచించింది. పనిదినాలను కాదని పండుగరోజే విచారణకు పిలువడం అనుమానాలకు తావిస్తున్నది. సోమవారం ఉదయం 10 గంటల కు సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేశ్ విచారణకు హాజరుకానున్నారు. రేవంత్ అధికా రం చేపట్టినప్పటి నుంచి ఇదే విపరీత ధోరణి అవలంబిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.