IPS Mahesh Bhagwat | యూనిట్ ఆఫీసర్లే ముందుంటారు.. సీటింగ్ అంశంలో కుల వివక్ష అవాస్తవం: మహేశ్ భగవత్
IPS Mahesh Bhagwat | యూనిట్ ఆఫీసర్ల సమావేశంలో సాధారణంగా వారే ముందు వరుసలో కూర్చుంటారని, లా అండ్ ఆర్డర్ డీజీపీ ఆ కోవకు చెందిన వారు కాదని సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ ఎం భగవత్ స్పష్టం చేశారు.
IPS Mahesh Bhagwat | హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): యూనిట్ ఆఫీసర్ల సమావేశంలో సాధారణంగా వారే ముందు వరుసలో కూర్చుంటారని, లా అండ్ ఆర్డర్ డీజీపీ ఆ కోవకు చెందిన వారు కాదని సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ ఎం భగవత్ స్పష్టం చేశారు.
ఆదివారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన ‘సీఎం సమక్షంలో దళిత ఐపీఎస్‌కు అవమానం’ అనే వార్తకు ఆయన స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన గణేశ్ ఉత్సవాల సమీక్షా సమావేశంలో వెనుక వరుసలో కూర్చోవడానికి, తన కులానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తనను దళిత అధికారిగా పేరొంటూ, అదే కారణంతో వెనుక వరుసలో కూర్చోబెట్టినట్టు వచ్చిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాను దళితుడిని కాదని స్పష్టంచేశారు.
అధికారుల సామాజిక స్థితిగతులు తెలియకుండా వారిని కులపరమైన వివాదాల్లోకి లాగడం సరికాదని పేర్కొన్నారు. యూనిట్ ఆఫీసర్ల మీటింగ్‌లో ఆ అధికారులకే ప్రాధాన్యం ఉంటుందని, ఒకవేళ మొదటి వరుసలో స్థలం ఖాళీగా ఉంటే, ఇతర సీనియర్ అధికారులు కూడా అకడ కూర్చోవచ్చనే విషయాన్ని గుర్తు చేశారు. కొన్ని రోజులుగా ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడంతో వెనుక వరుసలో కూర్చున్నానని వెల్లడించారు. సమావేశం ముగిసిన తర్వాత లా అండ్ ఆర్డర్ డీజీ హోదాలో మలాజిగిరి కమిషనరేట్‌లో పెద్ద గణేశ్ విగ్రహం ఏర్పాటు చేసే అంశంపై సీఎంతో స్వయంగా మాట్లాడినట్టు చెప్పారు. సీఎం కూడా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. సివిల్ సర్వెంట్లు ప్రవర్తనా నియమావళికి కట్టుబడి, వృత్తిపరంగా తమ విధులను నిర్వర్తిస్తున్నందున, తమను అనవసరమైన వివాదాల్లోకి లాగొద్దని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

