హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బార్ కౌన్సిల్ కీలక పదవులకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో చైర్మన్‌గా సాముల రామ్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌గా చలకాని వెంకట్ యాదవ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) సభ్యుడిగా గన్నమనేని కిరణ్‌కుమార్ ఎన్నికయ్యారు. ఎనిమిదేండ్ల తర్వాత ఈ ఎన్నికలు ఉతంఠభరితంగా సాగాయి. కో-ఆప్షన్ సభ్యునిగా ఉన్న అడ్వకేట్ జనరల్‌తో కలిపి 26మంది సభ్యుల ఓట్ల ఆధారంగా ఫలితాలు వెలువడ్డాయి. చైర్మన్ పదవికి పోటీచేసిన వారిలో తటస్థ అభ్యర్థి రామ్‌రెడ్డికి 12, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు అశోక్‌గౌడ్‌కు 11, టీ హన్మంత్‌రెడ్డికి 3 ఓట్లు వచ్చా యి. రామ్‌రెడ్డి ఒక్క ఓటు తేడాతో అశోక్‌గౌడ్‌పై గెలుపొందారు.
బీసీఐ వైస్‌చైర్మన్ పదవికి పోటీచేసిన అభ్యర్థుల్లో వెంకట్యాదవ్కు 13, జకీర్ హుస్సేన్ జావేద్‌కు 10, రామారావు గోకుల్‌కు 3 ఓట్లు వచ్చాయి. వెంకట్‌యాదవ్ 3 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. బీఆర్ఎస్ సానుభూతిపరుడిగా, కేసీఆర్ అభిమానిగా గుర్తింపు పొందిన వెంకట్‌యాదవ్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు.
బీసీఐ సభ్యుడి పదవికి పోటీచేసిన అభ్యర్థుల్లో గన్నమనేని కిరణ్‌కుమార్‌కు 10, డీ జగదీశ్వర్‌రావుకు 7, పాశం సుజాతకు 4, అనంతసేన్రెడ్డికి 3, అనిల్‌కుమార్‌కు 2 వచ్చాయి. కిరణ్‌కుమార్ 3 ఓట్ల తేడాతో గెలిచారు. సిద్దిపేటకు చెందిన కిరణ్‌కుమార్ నాంపల్లి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా, రాష్ట్ర ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. బీఆర్ఎస్ లీగల్ సెల్లో క్రియాశీలకంగా ఉన్నారు.
బార్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికైన సాముల రామ్‌రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో 1964 జూన్ 6న జన్మించారు. 1992లో హుజూర్నగర్, సూర్యాపేట జిల్లా కోర్టుల్లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పలు కేసులు వాదించారు. 1998-2006, 2007-2015 మధ్య కాలంలో హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగిన రామ్‌రెడ్డి.. మదర్ థెరిస్సా ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడిగా పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
గతంలో బార్ కౌన్సిల్‌కు 2018లో ఎన్నికలు జరిగాయి. కొత్త కౌన్సిల్ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరి 30న ఎన్నికలు నిర్వహించారు. 203 మంది న్యాయవాదులు పోటీచేయగా.. 23 మంది సభ్యులుగా ఎన్నికయ్యారు. మహిళలకు 30% శాతం ప్రాతినిధ్యం కల్పించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఐదుగురు మహిళలు ఎన్నికవగా.. మరో ఇద్దరు మహిళా సభ్యులను నామినేట్ చేశారు. ఇప్పుడు వీరిలో ముగ్గురు రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్‌చైర్మన్, బీసీఐ సభ్యుడిగా ఎన్నికయ్యారు.