ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ తమిళంలో తమ నాలుగో చిత్రాన్ని ప్రకటించింది. సినిమా పేరు ‘జాకీ’. ‘నో రీటేక్స్ అలౌడ్’ అనేది ఉపశీర్షిక. తమిళ యువహీరో ధృవ్ విక్రమ్ ఇందులో కథానాయకుడు. కరణ్ అరవింద్ కుమార్ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ని ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. పక్కా మాస్‌గా, లార్జర్ దేన్ లైఫ్ అవతార్‌లో ఉన్న ధృవ్ విక్రమ్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు.
ధృవ్ ఒరిజినల్ లుక్‌కి ైస్టెలిష్ కామిక్ బుక్ తరహా విజువల్‌ని జత చేసి వినూత్నంగా ఈ పోస్టర్ని డిజైన్ చేశారు. ైస్టెలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ధృవ్ పాత్ర క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుందని, ఓ కొత్త తరహా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వికీ, సంగీతం: సంతోష్ నారాయణన్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్.