Watch: ఒకవైపు భారీ వర్షం.. ట్యాంకర్తో మొక్కలకు నీరు పోసిన మున్సిపల్ సిబ్బంది
Civic workers water roadside plants in rain | ఒకవైపు భారీగా వర్షం కురుస్తున్నది. మరోవైపు రోడ్డు మధ్యలో డివైడర్ లోపల ఉన్న మొక్కలకు మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్ ద్వారా నీరు పోశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ సిబ్బందితో పాటు అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి.
ముంబై: ఒకవైపు భారీగా వర్షం కురుస్తున్నది. మరోవైపు రోడ్డు మధ్యలో డివైడర్ లోపల ఉన్న మొక్కలకు మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్ ద్వారా నీరు పోశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ సిబ్బందితో పాటు అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. (Civic workers water roadside plants in rain) మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పూణే నగరం కూడా తడిసిముద్దైంది.
కాగా, ఒకవైపు జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ మరోవైపు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లోని మొక్కలకు పూణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) సిబ్బంది ట్యాంకర్ ద్వారా నీళ్లు పోశారు. అప్పటికే వర్షానికి తడిసిన మొక్కలను ఇలా నీరు పోయడం చూసి స్థానికులు నోరెళ్లబెట్టారు. ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ మున్సిపల్ సిబ్బంది, అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు వాతావరణ పరిస్థితులను గమనించకుండా మున్సిపల్ సిబ్బంది మొక్కలకు నీళ్లు పోయడంపై పలువురు నెటిజన్లు మండిపడ్డారు. వారు యాంత్రికంగా పని చేస్తున్నారా? అని చాలా మంది ప్రశ్నించారు. సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అయితే రోడ్డు పక్కన ఉన్న మొక్కలకు వర్షాకాలంలో నీరు పోసే కాంట్రాక్ట్ విధానాన్ని సమీక్షించాలని కొందరు సూచించారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజాధనం వృథా అవుతుందని విమర్శించారు. అలాగే ఈ పని చేసే సిబ్బందిపైనే కాకుండా, షెడ్యూల్ చేసే అధికారులు దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Meanwhile in Pune… Paud Road Metro Station is making sure the plants don’t get dehydrated… during the rain. 🌧️🌱🤝 pic.twitter.com/Lyen0r5JLw
— Kaptan Hindustan™ (@KaptanHindustan) July 3, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

