హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థలో వాస్తవ పరిస్థితులేంటని..? కేంద్ర బొగ్గుశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి ఆరా తీశారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపు అంశాలపై సమీక్షించారు. శుక్రవారం రెడ్‌హిల్స్‌లోని సింగరేణి భవన్లో సంస్థ కార్యకలాపాలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సంస్థ అభివృద్ధి, సంస్కరణల అమలుకు ప్రత్యేక కమిటీని నియమించాలని సూచించారు. కోల్ గ్యాసిఫికేషన్‌పై దృష్టిపెట్టాలని, బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొని, కొత్త బ్లాక్‌లు సాధించాల న్నారు. సంస్థ వాస్తవ పరిస్థితులను కార్మికులకు వివరించాలని, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ.. పనిసామర్థ్యాన్ని పెంచాలని సూచించారు.