– భద్రాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి
కరకగూడెం, జులై 23 : తరగతి గదుల్లో వెనుకబడిన విద్యార్థులకు రెమెడియల్ టీచింగ్ ఎంతో ఉత్తమమైనదని, ఆ విధానంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారిణి వాసంతి అన్నారు. గురువారం కరకగూడెం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల మొదటి విడత శిక్షణ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. శిక్షణ నిర్వహణ, బోధన విధానాలు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం, శిక్షణలో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించారు. అనంతరం ఆమె ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు చేస్తూ మాట్లాడారు.
రెమిడియల్ టీచింగ్ ద్వారా చదువులో వెనకబడిన విద్యార్ధులను అభ్యాసన సామార్థ్యాలు సాధించేలా కృషి చేయాలన్నారు. శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. విద్యార్ధులు నేర్చుకునే స్థాయిని నిరంతరం పరిశిలిస్తూ అవసరమైన మేర విద్యా సహయాన్ని అందించాలని తెలిపారు. తమ బోధనతో విద్యార్ధులను ఉన్నతంగా తీర్చిదిద్దేందకు నిరంతరం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారిణి గడ్డం మంజూల, రిసోర్స్ పర్సన్స్ సూర్యనారాయణ, భావ్ సింగ్, తిరుమలరావు, గోపాలకృష్ణ, సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.