ఆర్మూర్ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలి?
ఆర్మూర్‌లో చేసిన అభివృద్ధి ఏమిటని, ఇప్పటివరకు ఎన్ని నిధులు తెచ్చారో ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి చెప్పాలని, ఈ విషయంపై చర్చించడానికి ఆయన బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్వీ నాయకుడు అభిలాష్‌రెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఆయన జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
- ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి బహిరంగ చర్చకు రావాలి..
- బీఆర్ఎస్వీ నాయకుల సవాల్
ఖలీల్‌వాడి, జూలై 4: ఆర్మూర్‌లో చేసిన అభివృద్ధి ఏమిటని, ఇప్పటివరకు ఎన్ని నిధులు తెచ్చారో ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి చెప్పాలని, ఈ విషయంపై చర్చించడానికి ఆయన బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్వీ నాయకుడు అభిలాష్‌రెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఆయన జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయ విమర్శలు చేసే ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాలని రాకేశ్‌రెడ్డిని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించే ప్రయత్నం మానుకుని, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి భారీ మొత్తంలో నిధులు మంజూరుచేయగా, వాటితో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తుచేశారు. అధికారంలో ఉన్న వారు మాటలతో కాకుండా పనులతో ప్రజల విశ్వాసాన్ని చూరగోనాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజాసమస్యలపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఆర్మూర్ అభివృద్ధికి ఎవరు ఎన్ని నిధులు తీసుకవచ్చారో బహిరంగంగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అదే ధైర్యం రాకేశ్‌రెడ్డికి ఉంటే తేదీ, వేదిక ప్రకటించాలని అభిలాష్‌రెడ్డి సవాల్ విసిరారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

