బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ఉమ్మడి జిల్లాలో సక్సెస్ అయ్యింది. తారక రామారావు ప్రసంగం కార్యకర్తల్లో జోష్ నింపింది. నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరులో ఆదివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి వివరిస్తూ.. అవన్నీ అందాయా.. అని కేటీఆర్ ప్రశ్నించడంతో అక్కడున్న వారంతా ఉత్సాహంగా అందలేదని ఒక్కసారిగా సమాధానమిచ్చారు.
ఆయన ప్రసంగం ఆద్యంతం ప్రజలను ఆలోచించేలా చేసింది. దీంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. చీకట్లోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, మొబైల్ ఫోన్లలో టార్చ్లైట్లతో కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. రోడ్ షో మొత్తం ఉత్సాహ భరిత వాతావరణంలో కొనసాగింది. కార్యక్రమానికి యువత, మహిళలు భారీగా తరలిరావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబురంలో మునిగాయి.