వీలునామా రిజిస్టర్ చేయకుండానే.. వారసుల మధ్య ఆస్తి పంపకాలు ఎలా?
నా పేరు ప్రకాశ్. మా తండ్రిగారు 2022లో చనిపోయారు. మేము మొత్తం 11 మంది. ఐదుగురు కొడుకులు, ఆరుగురు కూతుళ్లు. మా మధ్య ఎలాంటి ఆస్తి పంపకాలు జరుగలేదు. నిజానికి మా నాన్న వీలునామా తయారు చేయించినా.. దాన్ని రిజిస్టర్ చేయకుండానే అనారోగ్యంతో కన్నుమూశారు.
నా పేరు ప్రకాశ్. మా తండ్రిగారు 2022లో చనిపోయారు. మేము మొత్తం 11 మంది. ఐదుగురు కొడుకులు, ఆరుగురు కూతుళ్లు. మా మధ్య ఎలాంటి ఆస్తి పంపకాలు జరుగలేదు. నిజానికి మా నాన్న వీలునామా తయారు చేయించినా.. దాన్ని రిజిస్టర్ చేయకుండానే అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే మా అక్కాచెల్లెళ్లు ఆస్తిలో తమ వాటాను కోరుతూ 2024లో కోర్టును ఆశ్రయించారు. హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 కింద కేసు దాఖలు చేశారు. ఈ ఆస్తులు మా నాన్న సంపాదించినవే. దయచేసి ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలో సలహా ఇవ్వండి.
నిపుణుడి సలహా
హిందూ వారసత్వ చట్టం 1956 అమల్లోకి రాకముందు సంపాదించిన ఆస్తి అయితే తప్ప.. ఆ తర్వాత ఆర్జించిన ఆస్తిని పూర్వీకుల ఆస్తిగా పరిగణించలేము. ఈ ఆస్తుల్ని మీ నాన్నగారు తన సంపాదనతో కొన్నవేనని చెప్తున్నారు. కనుక ఈ ఆస్తులు హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) పరిధిలోకి కూడా రావు. ఇక భారతీయ వారసత్వ చట్టం కింద వీలునామాకు విలువ ఉండాలంటే అది రిజిస్టర్ కానక్కర్లేదు. అందువల్ల ఏవైనా ఇతర కారణాలుంటే తప్ప.. మీ నాన్నగారు చేయించిన వీలునామా చట్టబద్ధమైనదే.
కాగా, హిందూ వారసత్వ సవరణ చట్టం 2005.. 2005 సెప్టెంబర్ 9న అమల్లోకి వచ్చింది. 1956 చట్టాన్ని సవరించి ఆస్తిలో కొడుకులతోపాటు కూతుళ్లకూ సమాన హక్కుల్ని కల్పించారు. కాబట్టి ఆస్తుల్లో మీ అక్కాచెల్లెళ్లకూ వాటాలు ఉంటాయి. ఒకవేళ మీ నాన్నగారు వీలునామా చేయకుండానే మరణించినైట్టెతే.. హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం మీ అక్కాచెల్లెళ్లు, మీ అన్నదమ్ములతోపాటు ఆస్తుల్లో మీ అమ్మగారు, మీ తాత, నానమ్మలకూ (జీవించి ఉంటే) సమాన వాటాలు వస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

