దేవరకొండ, డిసెంబర్ 12 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఎల్లారెడ్డిబాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నుండి పలు కుటుంబలు మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అదే విధంగా కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలకు వివరించాలన్నారు. అన్ని స్థానంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పల్ల ప్రవీణ్ రెడ్డి, శ్రీను, వెంకటయ్య, రాజు, కృష్ణ పాల్గొన్నారు.