రామగిరి, డిసెంబర్ 12 : నల్లగొండ జిల్లా కేంద్రంలో అత్యంత ప్రాచీన, ప్రసిద్ది చెందిన బ్రహ్మంగారి గుట్టపై ఉన్న బూరుగు చెట్టు, మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నిర్వాహణ కమిటి కో కన్వీనర్, విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్లగొండ పరిచయ వేదిక కన్వీనర్ పగిడిమర్రి వెంకటాచారి అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ నల్లగొండ నిర్వహకులతో పాటు బ్రహ్మంగారి గుట్ట బూరుగు వృక్షం నిర్వహణ కమిటి సభ్యులు సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ నల్లగొండ అధ్యక్ష, కార్యదర్శులు దాసోజు శ్రీనివాస్, పెందోట సోము, కోశాధికారి పర్వతం నరేంద్రబాబు, గౌరవాద్యక్షుడు కోండోజు కృష్ణామాచారి, ఉపాధ్యక్షుడు శ్రీపాద కృష్ణామాచారి, ప్రచార కార్యదర్శి బొడ్డుపల్లి రామకృష్ణ, సభ్యులు దాసోజు యాదగిరి, తరుణోజు భీష్మాచారి, బౌరోజు రాఘవాచారి, ఓంకారాచారి, న్యాయవాది పందిళ్లపల్లి బ్రహ్మచారి ఉన్నారు.