Forex Reserve | ఈ నెల 5తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 1.033 బిలియన్లు పెరిగి 687.26 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత వారంలో మొత్తం నిల్వలు 1.877 బిలియన్లు తగ్గి 686.227 బిలియన్లకు తగ్గిన విషయం తెలిసిందే. తాజా డేటా ప్రకారం.. ఫారెక్స్ నిల్వలలో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 151 మిలియన్ డాలర్లు తగ్గి 556.88 బిలియన్లకు చేరుకున్నాయి. డాలర్‌తో పోలిస్తే యూరో, పౌండ్, యెన్ వంటి కరెన్సీలలో కూడా విదేశీ కరెన్సీ ఆస్తులు హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ఈ వారంలో బంగారం నిల్వల విలువ 1.188 బిలియన్లు పెరిగి 106.984 బిలియన్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRs) 93 మిలియన్ డాలర్లు పెరిగి 18.721 బిలియన్లకు చేరుకున్నాయని ఆర్బీఐ పేర్కొంది. ఇంటర్నేషనల్ మానిటరి ఫండ్ (IMF)లో భారత్ రిజర్వ్ స్థానం 9.7 మిలియన్లు తగ్గి 4.675 బిలియన్లకు చేరుకున్నట్లు చెప్పుకొచ్చింది.