Tejpratap Yadav : జన్శక్తి జనతాదళ్ (Janshakti Janta Dal) ను తాము జాతీయ పార్టీ (National level party) గా మారుస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tejpratap Yadav) ప్రకటించారు. అందుకోసం తాము దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వాలను స్వీకరిస్తున్నామని, ప్రజల నుంచి స్పందన కనిపిస్తోందని చెప్పారు.
జేజేడీని జాతీయ పార్టీగా మార్చడం కోసమే తాము ప్రాథమిక సభ్యత్వం స్వీకరిస్తున్నామని యాదవ్ చెప్పారు. పార్టీని బలోపేతం చేయడం కోసం తాము క్షేత్రస్థాయి నుంచి పనులు చేపడుతామని అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, 2027లో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ పడుతుందని యాదవ్ చెప్పారు.