బీబీనగర్, డిసెంబర్ 12 : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దులోని కొండమడుగు మెట్టు వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద సీఐ ప్రభాకర్ రెడ్డి, ఆర్ఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్.. యాదాద్రి జిల్లా సరిహద్దు కావడంతో అభ్యర్థులు మద్యం, నగదు, బహుమతులు రవాణా చేసే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.