బీబీనగర్, డిసెంబర్ 12 : రాఘవపురంలో బీఆర్ఎస్ జెండా ఎగరాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బీబీనగర్ మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బండారు శంకర్ గౌడ్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీన జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బండారు శంకరయ్యగౌడ్ ఉంగరం గుర్తుపై ఓటు వేసి ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే కళ్లబొల్లి మాటలు నమ్మితే గ్రామ అభివృద్ధి ఆగిపోతుందన్నారు. ప్రజల కోసం పని చేసే అభ్యర్థిని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో సీఎంగా కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన అనేక అభివృద్ధి పనులు చేపట్టారని, ప్రజలందరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడం బాధ్యత అన్నారు.
ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు మాజీ సభ్యురాలు గుంటిమీది భాగ్యమ్మ దయాకర్, బీఆర్ఎస్వీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జక్కి నగేశ్, గ్రామ శాఖ అధ్యక్షుడు బుయ్య కిశోర్ గౌడ్, నాయకులు దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అశోక్, సుర్వి బస్వరాజు గౌడ్, శివగోని రంగయ్య, ఒంగరి రమేశ్, బండారి ఆనంద్ గౌడ్, బండారి రాఘవేంద్ర గౌడ్, దొంతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అంబటి పరశురాం, జిల్లా నాయకులు కుతాడి సురేశ్, హరీశ్, వెంకటేశ్, మనోహర్ పాల్గొన్నారు.

Bibinagar : రాఘవపురంలో బీఆర్ఎస్ జెండా ఎగరాలి : చింతల వెంకటేశ్వర్ రెడ్డి