పెద్దవంగర/పర్వతగిరి, సెప్టెంబర్ 24: కాంగ్రెస్ పాలనపై ప్రజలు విరక్తి చెందారని.. ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా తగిన బుద్ధి చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం పెద్దవంగరలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, పర్వతగిరిలోని ఆయన స్వగృహంలో మండల ముఖ్య నాయకులు, పార్టీ గ్రామ ఇన్చార్జిలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిరుపేదలు, రైతుల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, నిరుపేదలపై అనుసరిస్తున్న విధానాన్ని ప్రజల్లోకి చేరేలా కృషి చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, దీన్ని ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందన్నారు.
స్థానిక ఎన్నికల్లో ప్రతి ఓటరు ఎంతో ముఖ్యమని, గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి కేసీఆర్ చేసిన పనులను వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేయాలని అభ్యర్థించాలని చెప్పారు. గ్రామాల ఇన్చార్జిలు గ్రామాల్లోకి వెళ్లి సమన్వయ పరచాలని సూచించారు. ‘కాంగ్రెస్ పాలనలో రైతులు ఆరిగోస పడుతున్నారు. వానకాలం సాగుకు ముందు నీళ్లులేక, ఉన్న నీళ్లతో వేసిన పంటకు సరిగా ఎరువులు లేక రైతులు ఇబ్బందు లు పడుతున్నారు. ఓ వైపు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రతి రైతుకు ఇస్తున్నామని చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో రైతులకు అందడంలేదు’ అని మండిపడ్డారు.
ఈ సందర్భంగా పర్వతగిరిలో వర్ధన్నపేట నియోజకవర్గ సోషల్ మీడియా లోగోను ఎర్రబెల్లి ఆవిష్కరించారు. అనంతరం యువత సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉండాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతున్న విషయాన్ని, అసమర్థ పాలనను ఎప్పటికప్పుడు ప్రశ్నించే గొంతుకలై తిప్పికొట్టాలన్నారు. కాగా, చెందిన బీఆర్ఎస్ నాయకులు మెరుగు అర్వపెల్లి తల్లి నర్సమ్మ బుధవారం మృతిచెందగా పార్థివదేహంపై పూలమాల ఉంచి నివాళులర్పించారు. కుటుంబాన్ని పరామర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలయ్య, రాజేశ్వర్‌రావు, కార్యదర్శి సంజయ్, దేవస్థానం మాజీ చైర్మన్ రామచంద్రశర్మ, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్‌కుమార్, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, మాజీ ఎంపీటీసీలు మాడుగుల రాజు, మోహన్‌రావు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు చింతపట్ల సోమేశ్వర్రావు, సుధీర్‌కుమార్, రాము, వెంకన్న, సమ్మయ్య, శ్రీనివాస్, రఘు, విజయ శ్రీనివాస్, భాసర్‌రావు, షర్ఫుద్దీన్, సుధాకర్, వెంకట్‌రెడ్డి, కృష్ణారెడ్డి, అశోక్, సోమనర్సయ్య, కృష్ణమూర్తి, భిక్షపతి, అనుదీప్, దయాకర్, రాజు, శ్రీనవాస్ గౌడ్, సంపత్, సోషల్ మీడియా నాయకులు తదితరులు పాల్గొన్నారు.