Doctorate | బచ్చన్నపేట, సెప్టెంబర్ 24 : జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామ వాసి కరుణ రెడ్డి. కూకట్పల్లిలోని జేఎన్టీయూహెచ్ హైదరాబాద్ కెమిస్ట్రీ లో ఫుల్ టైం పరిశోధన చేసి ఇంటర్నేషనల్ జర్నల్స్ పబ్లికేషన్స్ లో ప్రచురణ పొంది పీహెచ్డీ థీసిస్ సమర్పించారు. మూల్యాంకనం తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించిన అనంతరం డాక్టరేట్ పొందడానికి అర్హత సాధించారు. డిజైన్ సింథసిస్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఇండోల్ థైజోలోపిరిడిన్ బెసుడ్ హెట్రోసైకిలిక్ కాంపౌండ్స్ అండ్ ధైర్ బయోలాజికల్ సైన్స్ అనే అంశంపై ప్రొ. చిట్టిరెడ్డి వెంకటరమణ రెడ్డి పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తి చేశారు.
14వ స్నాతకోత్సవంలో పీహెచ్డీ పట్టా తీసుకోనున్నారు. కరుణ రెడ్డి జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ క్యాంపస్లో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివి యూనివర్సిటీ టాపర్గా నిలిచి 7వ స్నాతకోత్సవంలో గోల్డ్ మెడల్ తీసుకుంది. యూనివర్సిటీ టాపర్ అయినందున డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారత ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకమైన ఇన్స్పైర్ ఫెలోషిప్ అవార్డు కోసం సెలెక్ట్ చేశారు.
డీఎస్టీ ఫెలోషిప్తో 5 సంవత్సరాల పాటు కెమిస్ట్రీలో పరిశోధన చేశారు.
కరుణ రెడ్డి భర్త డా శాడగొండ కరుణాకర్ రెడ్డి కూడా గణిత శాస్త్రంలో పీహెచ్డీని 2014 సంవత్సరంలోనే ఇదే జేఎన్టీయూహెచ్ నుండి పట్టా తీసుకున్నారు. భార్య భర్తలు ఇద్దరు జేఎన్టీయూహెచ్ నుండి పట్టాలు తీసుకోవడం విశేషం. కరుణ రెడ్డికి డాక్టరేట్ రావటంపై జేఎన్టీయూహెచ్ ఉన్నతాధికారులు, డిపార్ట్మెంట్ ఆచార్యులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, వివిధ విద్యార్థి సంఘాలు, మిత్రబృందం, గ్రామస్తులు, హర్షం వ్యక్తం చేశారు.
BC Reservations | బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే : ఎమ్మెల్సీ మధుసూదనాచారి
Group-1 | గ్రూప్-1పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే
Supreme Court | అస్తిత్వ సంక్షోభంలో హిమాలయన్ రాష్ట్రాలు.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు