KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం ఎక్స్(ట్విట్టర్), ఇన్స్టాగ్రాం ఖాతాలను కేసీఆర్ తెరిచారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఉద్యమ కాలం నాటి తన ఫొటోను కేసీఆర్ జత చేశారు.
బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దాం అని కోరుతూ కేసీఆర్ రెండో ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! pic.twitter.com/X1FxmEugmN
— KCR (@KCRBRSPresident) April 27, 2024