Bajrag Punia | భజ్రంగ్ పూనియాపై నిషేధం.. ఒలింపిక్స్ కల చెదిరినట్టేనా..?
Bajrag Punia : భారత స్టార్ రెజ్లర్ భజ్రంగ్ పూనియా(Bajrag Punia)కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ (NADA) నిషేధానికి గురైన ఈ స్టార్ రెజ్లర్‌కు అంతర్జాతీయ రెజ్లింగ్ సంఘం(UWW) ఊహించని ఝలక్ ఇచ్చింది.
Bajrag Punia : భారత స్టార్ రెజ్లర్ భజ్రంగ్ పూనియా(Bajrag Punia)కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ (NADA) నిషేధానికి గురైన ఈ స్టార్ రెజ్లర్‌కు అంతర్జాతీయ రెజ్లింగ్ సంఘం(United World Wrestling) ఊహించని ఝలక్ ఇచ్చింది. పూనియాపై ఏడాది నిషేధం విధించింది. 2024 చివరి వరకూ అతడు ఎలాంటి పోటీల్లో పాల్గొనకూడదని తేల్చి చెప్పింది. దాంతో, ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024)లో పతకం గెలవాలనుకున్న భజ్రంగ్ కల చెదిరింది.
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యంతో మెరిసిన భజ్రంగ్ ప్యారిస్ విశ్వక్రీడల్లోనూ పతకం గెలుస్తాడని అనుకున్నారంతా. అందుకు తగ్గట్టే అతడు సన్నద్ధమయ్యాడు. అయితే.. ఏమైందో తెలియదు నాడాకు డోప్ టెస్టు కోసం రక్త, మూత్ర నమూనా ఇచ్చేందుకు అతడు అంగీకరించలేదు. దాంతో, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నాడా పూనియాపై వేటు వేసింది.

విదేశాల్లో శిక్షణ కోసం..
ఇప్పుడు ప్రపంచ రెజ్లింగ్ సంఘం సైతం ఈ ఒలింపిక్ మెడలిస్ట్‌ను సస్పెండ్ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పోటీలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో పూనియాకు ఏమీ చేయాలో తోచడం లేదు. ఇప్పటికే విదేశాల్లో శిక్షణ కోసం అతడికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) రూ. 9 లక్షలు మంజూరు చేసింది. అంతా సవ్యంగా సాగుతుందని అనుకుంటున్న తరుణంలోనే ప్రంచ రెజ్లింగ్ సమాఖ్య నిర్ణయంతో పూనియా కంగుతిన్నాడు.
ఇవి కూడా చదవండి
- watch: కుమారుడితో ఓటు వేయించిన బీజేపీ నేత.. వీడియో వైరల్
- YS Jagan tour | ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశాల పర్యటన అనుమతి కేసు విచారణ 14కు వాయిదా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

