Navneet Rana: మాకు 15 సెకన్లు చాలు.. నవనీత్ రాణా వార్నింగ్
Navneet Rana: 11 ఏళ్ల క్రితం అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు బీజేపీ నేత నవనీత్ రాణా కౌంటర్ ఇచ్చారు. 15 నిమిషాలు పోలీసుల్ని తొలగిస్తే ఏం చేయాలనో అది చేస్తామని గతంలో అక్బరుద్దీన్ అన్నారు. దానికి కౌంటర్ ఇచ్చిన నవనీత్ రాణాకు తమకు 15 సెకన్లు చాలు అన్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీ లత తరపున నవనీత్ ప్రచారం నిర్వహించారు.
న్యూఢిల్లీ: 15 నిమిషాల పాటు పోలీసుల్ని తొలగిస్తే, మేం ఏం చేస్తామో చేసి చూపిస్తామని 11 ఏళ్ల క్రితం ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఓ సందర్భంలో వార్నింగ్ ఇచ్చారు. అయితే హిందువులను ఉద్దేశించి ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆ వ్యాఖ్యలకు ఇప్పుడు బీజేపీ నేత నవనీత్ రాణా( Navneet Rana) కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీ లత తరపున ప్రచారం చేస్తున్న ఆమె మాట్లాడుతూ.. 15 నిమిషాలు కాదు.. తమకు 15 సెక్షన్లు సరిపోతుందని నవనీత్ రాణా అన్నారు. హైదరాబాద్‌ను పాకిస్థాన్‌గా మార్చకుండా ఉండేందుకు మాధవీ లత అడ్డుకుంటుందని కూడా రాణా అన్నారు. కాంగ్రెస్‌కు కానీ ఎంఐఎంకు కానీ ఓటేస్తే, పాకిస్థాన్‌కు అనుకూలంగా ఓటేసినట్లు అవుతుందని నవనీత్ అన్నారు. 39 సెకన్ల వీడియోను రాణా తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. ఆ పోస్టును ఓవైసీ సోదరులకు కూడా ట్యాగ్ చేశారు.
15 सेकंद लगेगा @AkbarOwaisi_MIM @asadowaisi pic.twitter.com/TfEmWhvArX
— Navnit Ravi Rana (Modi Ka Parivar) (@navneetravirana) May 8, 2024
నవనీత్ రాణా చేసిన కామెంట్‌కు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. నవనీత్ రాణాకు 15 సెకన్ల సమయం ఇవ్వాలని ప్రధాని మోదీని కోరుతున్నట్లు చెప్పారు. ఆమె ఏం చేస్తుంది, 15 సెకన్లు కాదు, గంట ఇవ్వండి, వాళ్లు ఏం చేస్తారో మాకు కూడా చూడాలని ఉందని, ఇక్కడేమైనా మానవత్వం మిగిలి ఉందా, ఎవరూ భయపడేది లేదు, మిమ్మల్ని ఎవరూ అడ్డుకోవడం లేదని అసద్ అన్నారు.
#WATCH | Hyderabad, Telangana: On BJP leader Navnit Ravi Rana’s “15 seconds lagenge” remark in Hyderabad, AIMIM chief Asaduddin Owaisi says, “I tell Modi ji – give her 15 seconds. What will you do?…Give her 15 seconds, give her 1 hour. We too want to see if you have any… pic.twitter.com/e1uD3M6nhl
— ANI (@ANI) May 9, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

