బెంగాల్లో బీజేపీ విభజన రాజకీయాలు : మమతా
బెంగాల్ | బెంగాల్లో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఎంఐఎం పార్టీ, ఇండియన్ సెక్యులర్(ఐఎస్ఎఫ్) పార్టీలు కలిసి పోటీ చేసేలా బీజేపీ ప్రోత్సహించిందని ఆరోపించారు.

కోల్‌కతా : బెంగాల్లో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఎంఐఎం పార్టీ, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) పార్టీలు కలిసి పోటీ చేసేలా బీజేపీ ప్రోత్సహించిందని ఆరోపించారు. దక్షిణ 24 పరగణ జిల్లాలోని రౌదిఘీ స్టేడియంలో శనివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. బెంగాల్‌ను బీజేపీ నాశనం చేస్తుందన్నారు. ఇక్కడ హిందువులు, ముస్లింలు ఒకరితో ఒకరు కలిసి టీ తాగుతారని, దుర్గా పూజను కలిసి జరుపుకుంటారన్నారు. కానీ ‘గ్రామాల్లో అశాంతి ఉంటేనే బీజేపీకి ప్రయోజనం ఉంటుందని’ ఆరోపించారు. ‘ఎస్సీ వర్గానికి చెందిన వారు చెందిన వారు నాతో కలిసి నా ఇంట్లో తింటారు’.. బీజేపీ నేతలు ఫైవ్ స్టార్ హోటళ్లలో తింటారు’ అన్నారు.
ఎంఐఎం, ఐఎస్ఎఫ్ పార్టీలపై సైతం విమర్శలు గుప్పించారు. హిందువులు, ముస్లింలను విభజించేందుకు బీజేపీ ఆయా పార్టీల నేతలకు డబ్బులు ముట్టజెప్పిందని ఆరోపించారు. ఎన్ఆర్సీతో పాటు ప్రజలను విభజించకూడదనుకుంటే.. వారికి ఓటు వేయొద్దని, ఆ పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు. రైదిఘీ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నీరు తాగునీరు ఇస్తామని, ప్రభుత్వ హాస్పిటళ్లు, ప్రైవేటు నర్సింగ్ హోంలలో ఉచిత వైద్యసేవలు ప్రారంభిస్తామన్నారు. 294 నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎనిమిది విడతలుగా ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే రెండు దశల ఎన్నికలు ముగిశాయి. మూడో దశ పోలింగ్ ఈ నెల 6న జరుగనుంది.
ఇవి కూడా చదవండి..
ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?
60 ఏండ్లు దాటినా.. ఖండాలు మారినా.. అదే ప్రేమ!
ఈ ఆకుల ధర కిలోకు లక్ష
ఆన్లైన్ విమర్శకుల్ని అరెస్టు చేస్తున్న సైన్యం
కేరళలో ట్రాన్స్‌జెండర్ కు బెదిరింపులు.. నామినేషన్ విత్‌డ్రా
కాకి ని చూసి మనషులు సిగ్గు పడాలి.. వీడియో వైరల్
యూట్యూబ్‌లో సర్కారు బడి
బీటెక్‌లో లేకున్నా ఎంటెక్‌లో చదవొచ్చు
మద్యం మత్తులో ఇంటికి నిప్పు.. ఆరుగురు సజీవ దహనం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

