కేరళలో ట్రాన్స్‌జెండర్ కు బెదిరింపులు.. నామినేషన్ విత్‌డ్రా
ట్రాన్స్‌జెండర్ | కేరళ అసెంబ్లీ చరిత్రలో తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్ ఎన్నికల బరిలో నిలిచిన విషయం విదితమే. మలప్పురంలోని వెంగర నియోజకవర్గం నుంచి ట్రాన్స్‌జెండర్ అనన్య కుమారి అలెక్స్ నామినేషన్ దాఖలు

తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ చరిత్రలో తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్ ఎన్నికల బరిలో నిలిచిన విషయం విదితమే. మలప్పురంలోని వెంగర నియోజకవర్గం నుంచి ట్రాన్స్‌జెండర్ అనన్య కుమారి అలెక్స్ నామినేషన్ దాఖలు చేయగా.. రిటర్నింగ్ అధికారి వాటిని ఆమోదించారు. డెమోక్రటిక్స్ సోషల్ జస్టిస్ పార్టీ తరపున ఆమె పోటీ చేశారు.
అయితే ఆ పార్టీ నాయకుల నుంచే ఆ ట్రాన్స్‌జెండర్‌కు బెదిరింపులు వచ్చాయి. మానసిక వేధింపులు అధికమయ్యాయని, నామినేషన్ విత్‌డ్రా చేసుకోకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని అని అనన్య పేర్కొన్నారు. ఆ వేధింపులు భరించలేకనే ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. వెంగర నియోజకవర్గంలో ఎల్డీఎఫ్ అభ్యర్థిగా పి.జీజీ, ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) అభ్యర్థి కునాలీకుట్టి పోటీ పడుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

