Bangladesh T20 Squad : భారత పర్యటనలో ఆఖరి టెస్టు ఆడుతున్న బంగ్లాదేశ్(Bangladesh) ఆ తర్వాత టీ20 పోరుకు సన్నద్దం అవుతోంది. అక్టోబర్ 6న పొట్టి సిరీస్ మొదలు కానున్న నేపథ్యంలో సోమవారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) స్క్వాడ్‌ను ప్రకటించింది. టెస్టులు, వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నజ్ముల్ హుసేన్ శాంటో(Najmul Hussain Shanto) ఈ ఫార్మాట్లోనూ జట్టును నడిపించనున్నాడు.
ఇక విధ్వంసక ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్, టీ20 వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించిన యువకెరటం తౌహిద్ హృదయ్, పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. సీనియర్ ఆటగాడు మహ్మదుల్లా సైతం స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు.
Here’s the complete Bangladesh squad ➡ https://t.co/HbcK0HK1fj
Mehidy Hasan returns as Bangladesh announces T20I squad for India tour#INDvBAN #T20I #CricketTwitter pic.twitter.com/e0CyBE65DC
— CricketTimes.com (@CricketTimesHQ) September 30, 2024
బంగ్లాదేశ్ స్క్వాడ్ : నజ్ముల్ హుసేన్ శాంటో(కెప్టెన్), తంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొసేన్ ఎమొన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, లిట్టస్ దాస్, జకీర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, షేక్ మహెదీ హసన్, రిషద్ హొసేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్, షొరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ షకీబ్, రకిబుల్ హసన్.
భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య అక్టోబర్ 6న పొట్టి సిరీస్ షురూ కానుంది. తొలి మ్యాచ్‌కు గ్వాలియర్‌లోని న్యూ మాధవరావు సిండియా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక రెండో మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరుగనుంది. ఇరుజట్ల మధ్య సాగనున్న ఆఖరి టీ20కి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదిక.