Bulldozer Action | బుల్డోజర్తో ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. అస్సాం ప్రభుత్వానికి ధిక్కార నోటీసు
Bulldozer Action | బుల్డోజర్తో ఇళ్లను కూల్చివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అస్సాం ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు సెప్టెంబర్ 17న ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు న్యాయపరమైన అనుమతి లేకుండా కూల్చివేతలను దేశవ్యాప్తంగా నిషేధించింది.
గువాహతి: బుల్డోజర్తో ఇళ్లను కూల్చివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. (Bulldozer Action) అస్సాం ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు సెప్టెంబర్ 17న ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు న్యాయపరమైన అనుమతి లేకుండా కూల్చివేతలను దేశవ్యాప్తంగా నిషేధించింది. అయితే రోడ్లు, ఫుట్పాత్లు, రైల్వే లైన్లు, నీటి వనరుల ఆక్రమణలకు సంబంధించిన కేసులకు మినహాయింపు ఇచ్చింది.
కాగా, అస్సాం కమ్రూప్ జిల్లా కచుటోలి పత్తర్ గ్రామం పరిధిలో గిరిజన భూమిని ఆక్రమించి నిర్మించిన 47 ఇళ్లను అధికారులు ఇటీవల కూల్చివేశారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అధికారులు ఉల్లంఘించారని 47 మంది నివాసితులు ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ పిటిషన్లు పరిష్కరించే వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని అస్సాం అడ్వకేట్ జనరల్ సెప్టెంబరు 20న గౌహతి హైకోర్టుకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే భూ యజమానులతో ఒప్పందాలు చేసుకుని దశాబ్దాలుగా తాము అక్కడ నివసిస్తున్నామని, చట్టపరమైన నిబంధనలను తాము ఉల్లంఘించలేదని పిటిషనర్లు వాదించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిపింది. అస్సాం ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ రాష్ట్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

