కాన్పూర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు(Ind Vs Ban)లో.. రోహిత్ సేన రెండు రికార్డులు క్రియేట్ చేసింది. కాన్పూర్ టెస్టులో ఇవాళ టీమిండియా కేవలం 10.1 ఓవర్లలో వంద పరుగులు చేసింది. టెస్టుల్లో అత్యంత వేగంగా వంద రన్స్ స్కోర్ చేసిన జట్టుగా టీమిండియా రికార్డును అందుకున్నది. గ్రీన్ పార్క్ మైదానంలో భారత బ్యాటర్లు శరవేగంగా రన్స్ స్కోర్ చేశారు. బంగ్లా ఆలౌటైన తర్వాత ఇండియా తొలి ఇన్నింగ్స్ ఆరంభించింది. కేవలం మూడు ఓవర్లలోనే 50 రన్స్ మార్క్‌ను దాటారు. టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన జట్టుగా ఇండియా రికార్డు క్రియేట్ చేసింది. జైస్వాల్ 72, రోహిత్ 23 రన్స్ చేసి ఔటయ్యారు. గిల్ 30 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. కడపటి వార్తలు అందేసరికి.. ఇండియా 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 127 రన్స్ చేసింది.
From 0 to 50 in no time ⚡
2024 has been a year of fast starts in Test cricket! #INDvBAN pic.twitter.com/3JIqJsQTUx
— ESPNcricinfo (@ESPNcricinfo) September 30, 2024