తాండూర్ : తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా జన జాగృతి కళావేదిక ఆధ్వర్యంలో గ్రామస్థులకు హెచ్ఐవీ( HIV) , ఎయిడ్స్ ( AIDS ) పై అవగాహన (Awareness Programmme ) కల్పించారు. మంచిర్యాల జిల్లా డీఎంహెచ్వో ఆదేశాల మేరకు తాండూర్ మండల కేంద్రం ఐబీలో సోమవారం కళాకారులు పల్లె సుద్దులు, పాటలు, మాటలతో ప్రజల్ని చైతన్య పరిచారు.
అరక్షితమైన లైంగిక సంబంధాల ద్వారా, కలుషితమైన సూదులు, సిరంజీలు, కలుషితమైన రక్తమార్పిడి ద్వారా, హెచ్ఐవీ సోకిన తల్లి నుంచి బిడ్డకు వస్తుందని వివరించారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ఐసీటీసీ కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీం లీడర్ రాజు, తిరుపతి, కళాకారులు గణేష్, శంకర్, గౌతమ్, హిమశ్రీ, చైల్డ్ వన్ ఇండియా లింక్ వర్కర్స్ రాజేశ్వరి, భాస్కర్, అనిత ఎన్జీవో పార్వతి, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.