తాండూర్ : దుర్గా నవరాత్రి ఉత్సవాలు ( Durga Navratri celebrations) సోమవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. తాండూరు మండల కేంద్రంతో పాటు మండలంలోని పలుచోట్ల దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. తొమ్మిది రోజులపాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాల తొలిరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి (Bala Tripura Sundari) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
మాదారం టౌన్ షిప్ లోని కోదండ రామాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు అవధూత శర్మ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు అమ్మవారికి దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు చేయనున్నారు. మొదటి రోజు సూరం రవీందర్ రెడ్డి, తులసి దంపతులు పూజలో పాల్గొన్నారు.