PM Modi | జీఎస్టీ సేవింగ్ ఫెస్టివల్‌పై ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. జీఎస్టీ సంస్కరణలు ప్రస్తుతం వాటి ప్రభావాన్ని చూపిస్తున్నాయని.. దేశవ్యాప్తంగా ‘జీఎస్టీ సేవింగ్ ఫెస్టివల్’ ప్రారంభమైందని ప్రధానమంత్రి లేఖలో పేర్కొన్నారు. ఈ సంస్కరణలు ప్రజల పొదుపును పెంచుతాయని.. సమాజంలోని ప్రతి విభాగానికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు వృద్ధి, పెట్టుబడులను పెంచుతాయని.. ప్రతి రాష్ట్రం, పురోగతిని వేగవంతం చేస్తాయన్నారు.
జీఎస్టీ సంస్కరణలు వ్యవస్థను సరళీకృతం చేశాయని, పన్ను రేట్లను తగ్గించాయని.. పొదుపుకు దారితీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వావలంబన భారతదేశం లక్ష్యం వైపు పురోగతిని నొక్కి చెప్పారు. జీఎస్టీ సంస్కరణలు స్థానిక తయారీని బలోపేతం చేస్తాయని తెలిపారు. దుకాణదారులు ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను విక్రయించాలని.. ‘మీరు ఏది కొన్నా స్వదేశీ.. మీరు ఏది అమ్మినా స్వదేశీ’ అని గర్వంగా చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పరిశ్రమ, తయారీని ప్రోత్సహించాలని.. పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.