PM Modi | సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం (Saudi Accident) జరిగిన విషయం తెలిసిందే. మక్కా యాత్రకు వెళ్లిన (Umrah Pilgrims) భారతీయులు (Indians) ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 42 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
‘మదీనాలో (Medina Bus Accident) జరిగిన ప్రమాదంలో భారతీయులు మరణించడం తీవ్ర బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడివారు త్వరగా కోలుకోవాలి’ అని ఎక్స్ పోస్టులో ప్రధాని రాసుకొచ్చారు. సౌదీ అరేబియా ప్రభుత్వంతో భారత అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ కావాల్సిన సహాయం అందిస్తున్నాయని ప్రధాని వెల్లడించారు.
Also Read..
Saudi Accident | సౌదీ ప్రమాదంలో మృతిచెందిన 16 మంది హైదరాబాదీలు.. వారి వివరాలు..
Saudi Bus Accident | సౌదీలో బస్సు ప్రమాదం.. మృతుల్లో మల్లేపల్లికి చెందిన 16 మంది యాత్రికులు
Saudi Accident | సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 42 మంది హైదరాబాదీలు సజీవదహనం