Saudi Accident | సౌదీ ప్రమాదంలో మృతిచెందిన 16 మంది హైదరాబాదీలు.. వారి వివరాలు..
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Saudi Accident) 42 మంది భారతీయ యాత్రికులు సజీవ దహనమయ్యారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా యాత్ర ముగించుకున్న భారతీయులు మదీనాకు బస్సులో బయల్దేరారు.
హైదరాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Saudi Accident) 42 మంది భారతీయ యాత్రికులు సజీవ దహనమయ్యారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా యాత్ర ముగించుకున్న భారతీయులు మదీనాకు బస్సులో బయల్దేరారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో బదర్-మదీనా మధ్య ముఫరహత్ వద్ద వారు ప్రయాణిస్తున్న బస్సు.. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 42 మంది నిద్రలోనే సజీవ దహనమయ్యారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 చిన్నారులు ఉన్నారు. కాగా, మరణించిన వారిలో హైదరాబాదీలు కూడా ఉన్నారు. మల్లేపల్లిలోని బజార్‌ఘాట్‌కు చెందిన 16 మంది మృతిచెందారు.
వారిని రహీమున్నీసా, రహత్ బీ, షేహనాబ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహ్మద్ మంజూర్, మహ్మద్ అలీగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. కాగా, ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. వివరాలకోసం 79979 59754, 99129 19545 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపింది.








Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

