Pawan Kalyan | హైదరాబాద్ సీపీ సజ్జనార్, పోలీసులకు పవన్‌కల్యాణ్ అభినందనలు
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్‌కల్యాణ్ హైదరాబాద్ పోలీసులకు అభినందనలు తెలిపారు.
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్‌కల్యాణ్ ( Pawan Kalyan)హైదరాబాద్ పోలీసులకు అభినందనలు తెలిపారు. పైరసీ ముఠాను అరెస్టు చేసిన సజ్జనార్ ( Sajjanar ) , పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పైరసీ ముఠాల వల్ల సీని పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని అన్నారు . ఐబొమ్మ ( IBomma) , బెప్పం( Beppam) వెబ్సైట్లు మూసివేయించడం స్వాగతించదగ్గ పరిణామని పేర్కొన్నారు. హైదరాబద్ సైబర్‌క్రైమ్ పోలీసుల ఆపరేషన్ విజయవంతమైందని వెల్లడించారు. సజ్జనార్చర్యలు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయని తెలిపారు.
పైరసీ వల్ల సినిమా పరిశ్రమకు నష్టం చేస్తున్న ఐబొమ్మ (Ibomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని (Immadi Ravi) అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనర్ సోమవారం వెల్లడించారు. ఇమ్మడి రవి పై ఐటీ యాక్ట్, కాపీ రైట్ యాక్ట్ కింద మరో 4 కేసులు నమోదు చేసినట్లు మీడియా సమావేశంలో చెప్పారు. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సినీపెద్దలు చిరంజీవి, నాగార్జున, దిల్‌రాజు, సురేశ్ బాబుతో పాటు దర్శకుడు రాజమౌళి సీపీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు. అనంతరం సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పైరసీకి సంబంధించి అంతకు ముందు ప్రశాంత్, శివరాజ్‌ను కూడా అరెస్టు చేశాం. ఇమ్మడి రవి సమాజానికి రెండు రకాలుగా నష్టం చేకూర్చాడు. పైరసీ ద్వారా చిత్రపరిశ్రమకు కోట్ల నష్టం చేయడమే కాకుండా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశాడని తెలిపారు. దీంతో చాలా మంది డబ్బు, ప్రాణాలు కోల్పోయారు.
ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే కొత్త సైట్‌ను తయారు చేశాడు. ఇలా65 మిర్రర్ వెబ్సైట్లు నిర్వహించాడు. 21 వేల సినిమాలు అతడి హార్డ్ డిస్క్‌లో ఉన్నాయి. 1972లో విడుదలైన గాడ్‌ఫాదర్ నుంచి మొన్న వచ్చిన ఓజీ వరకు అందులో ఉన్నాయి. పైరసీ ద్వారా రూ.20 కోట్లు సంపాదించాడని తెలిపారు. అందులో రూ.3 కోట్లు సీజ్ చేశాం. సైట్‌ను సందర్శించిన వారి డేటా మొత్తం రవి వద్ద ఉంది. ప్రజల డాటాను సైబర్ నేరాల ముఠాలకు అమ్ముకున్నారు. డేటా చోరీ జరగడం వల్ల ప్రజలకు కూడా వేల కోట్ల నష్టం జరిగింది. రవి వద్ద 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా ఉంది. ఇంత డేటా అతడి వద్ద ఉండటం ప్రమాదకరం. దీన్ని సైబర్ నేరగాళ్లు వాడుకునే అవకాశం ఉందని తెలిపారు.
ఇమ్మడి రవి స్వస్థలం విశాఖపట్నం..
ఇమ్మడి రవి స్వస్థలం విశాఖపట్నం. బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన అతడు వేరే పేర్లతో మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులు తీసుకున్నాడు. మొదటి నుంచి నేర ప్రవృత్తితో ఉన్నాడు. సినీరంగం అప్రమత్తమై ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు అతడి వెంట పడ్డారని వివరించారు. దీంతో భారత పౌరసత్వాన్ని వదిలి కరేబియన్ దీవుల్లో ఉన్న సెయింట్ నేవీ దేశ పౌరసత్వం తీసుకున్నాడు. ఫ్రాన్స్‌లో ఉంటూ వివిధ దేశాలు తిరిగేవాడు. 2019 నుంచి ఐబొమ్మ వెబ్‌సైట్‌ను నడుపుతున్నాడు. 21 వేల సినిమాలు పైరసీ చేశాడని వెల్లడించారు.
అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్ నుంచి సర్వర్లు నడుపుతున్నాడు. 110 డొమైన్లను రవి ముఠా కొనుగోలు చేసింది. ఒకటి బ్లాక్ చేస్తే మరొకటి ఓపెన్ చేస్తూ పైరసీ సినిమాలు విడుదల చేశాడు. సీక్రెట్ కెమెరాలు, టెక్నాలజీ వాడుతూ సినిమాలు పైరసీ చేశాడు. టెలిగ్రామ్ చానళ్ల ద్వారా సినిమాల డేటా ట్రాన్స్ఫర్ జరిగిందని పేర్కొన్నారు.
ప్రజలు కూడా ఇలాంటి పైరసీ వెబ్సైట్లను ప్రోత్సహించకూడదు. ఏపీకే ఫైల్స్ క్రియేట్ చేసి ప్రజలడేటా చోరీ చేశారు. ఇమ్మడి రవిని పోలీసులే స్వతహాగా పట్టుకున్నారు. ఎవరో ఇచ్చిన సమాచారంతో పట్టుకున్నామనేది అబద్ధం. ఈ రాకెట్లో ఉన్న మిగతా వాళ్లను కూడా బయటకు తీసుకువస్తాం’ అని సజ్జనార్ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

