Bihar | 20న బీహార్లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం.. హాజరుకానున్న ప్రధాని మోదీ
బీహార్లో (Bihar) ఎన్డీఏ కూటమి 202 సీట్లతో ఘన విజయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ (Nitish Kumar) 10వ సారి పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నెల 20న (గురువారం) కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.
పాట్నా: బీహార్లో (Bihar) ఎన్డీఏ కూటమి 202 సీట్లతో ఘన విజయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ (Nitish Kumar) 10వ సారి పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నెల 20న (గురువారం) కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సీఎంగా నితీశ్ కుమారు, పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్ వేదిక కానుంది. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ (PM Modi) హాజరుకానున్నారు.
కాగా, సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రస్తుత మంత్రిమండలి చివరిసారిగా భేటీ కానుంది. సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షతన జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు తీర్మాణం చేయనున్నారు. అనంతరం నితీశ్ కుమార్ తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్కు అందించనున్నట్లు జేడీయూ సీనియర్ వెల్లడించారు.
బీహార్ అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకు గాను 202 సీట్లలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. ఇందులో బీజేపీకి 89, నితీశ్ కుమార్కు చెందిన జేడీ(యూ)కు 85, కూటమి పార్టీలైన ఎల్జేపీ (రామ్ విలాస్)కి 19, హెచ్ఏఎం 5 , ఆర్ఎల్ఎస్పీ 4 సీట్లలో గెలుపొందాయి. దీంతో బీహార్లో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టడానికి సిద్ధమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

