నార్నూర్, సెప్టెంబర్ 22 : ముప్పై పడకల దవాఖానలో సమస్యలు పరిష్కరించాలని ఆమరణ నిరాహారదీక్ష ను చేపట్టనున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు బిక్కు రాథోడ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద విలేకరులతో మాట్లాడుతూ..నార్నూర్, గాదిగూడ మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ముప్పై పడకల హాస్పిటల్‌ను ప్రారంభించారన్నారు.
కానీ నేటికీ వైద్యుల కొరత, సమస్యలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సమయంలో మెరుగైన చికిత్స కోసం ఉట్నూర్, అదిలాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. నేడు హాస్పిటల్ ఎదుట సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఆమరణ నిరాహార దీక్ష పట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రకాష్, దేవిదాస్, రాజబాబు, మహేందర్, శ్రీకాంత్, శ్రీధర్ తదితరులున్నారు.