Audit | రాయపోల్, 23 జులై : దౌల్తాబాద్ మండల వనరుల కేంద్రంలో బుధవారం పాఠశాలల నిధుల వినియోగంపై ఆడిట్ నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాధికారి గజ్జల కనకరాజు తెలిపారు. 2024-25 సంవత్సరానికిగాను పాఠశాలల అభివృద్ధికై విడుదలైనటువంటి నిధుల వినియోగంపైన ఆడిట్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.
ఆడిట్ అధికారులు కోటేశ్వర రావు, శ్రీనివాస్, రమేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు పకడ్బందీగా పాఠశాల అభివృద్ధికి వినియోగించారో లేదో ఆడిట్ చేయడం జరిగింది. ఈ ఆడిట్‌కు దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి, అప్జల్ హుస్సేన్, బాసిత్ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Ganja Seized | ద్విచక్ర వాహనంపై గంజాయి తరలింపు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Vice president Elections | ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టిన ఈసీ