Tunnel | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని కోలీవుడ్ యాక్టర్లలో ఒకరు అథర్వ మురళి (Atharvaa murali). తెలుగులో గద్దల కొండ గణేశ్ సినిమాలో మెరిసిన ఈ టాలెంటెడ్ యాక్టర్ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. కొత్త సినిమా కోసం ఖాకీ చొక్కా వేసుకున్నాడు అథర్వ మురళి. ఈ సారి యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లింగ్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
రవీంద్ర మాధవ దర్శకత్వంలో అథర్వ మురళి నటించిన తమిళ చిత్రం (Tunnel ). తెలుగులో టన్నెల్ టైటిల్‌తో విడుదలవుతోంది. ఈ మూవీని తెలుగులో సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా ఏ రాజు నాయక్ తెలుగులో విడుదల చేస్తున్నారు. అశ్విన్ కాకుమాను ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు.
క్రూరమైన హత్యల వెనుకున్న సైకోను పట్టుకునే పోలీసాఫీసర్‌గా అథర్వ మురళి కనిపించనున్నట్టు ట్రైలర్ హింట్ ఇచ్చేస్తుంది. ఇంతకీ అతడు ఆ సైకోను పట్టుకున్నాడా..? లేదా..? అనే సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేస్తుంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కొణిదెల హీరోయిన్గా నటిస్తోంది.
The Gripping Action Thriller #Tunnel starring @Atharvaamurali @ItsLavanya @ashwinkakumanu Is All Set For Release On September 12th
Telugu Release Through #ARajuNayak ‘s #LachuramProductions@sakthisaracam @justin_tunes @kalaivananoffl @Harikiran1483 @Dastha07gray… pic.twitter.com/PiBIJG3ecB
— Sai Satish (@PROSaiSatish) September 1, 2025
Vada Chennai 2 | వడ చెన్నై 2 వచ్చేస్తుంది.. క్రేజీ సీక్వెల్‌పై వెట్రిమారన్ ఏమన్నాడంటే..?
Game Changer Editor | డైరెక్టర్‌గా గేమ్ ఛేంజర్ ఎడిటర్.. స్టార్ హీరో సినిమాతో గ్రాండ్ ఎంట్రీ..!