Kannappa | మంచు విష్ణు ప్రధాన పాత్రలో మైథలాజికల్ నేపథ్యంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘కన్నప్ప’ థియేటర్లలో మంచి విజయాన్ని నమోదు చేసింది. పాన్-ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేశారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదలైన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ దర్శకుడు అయిన ముఖేష్, ‘మహాభారతం’ సీరీస్‌తో మంచి గుర్తింపు పొందారు. ఇక ఈ చిత్రానికి మోహన్ బాబు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
ఈ చిత్రంలో గెస్ట్ రోల్స్ లో మోహన్ బాబు, శివబాలాజీ, ప్రభాస్ (రుద్రుడిగా), అక్షయ్ కుమార్ (శివుడిగా), కాజల్ అగర్వాల్ (పార్వతిగా), మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్,మధుబాల,బ్రహ్మానందం, రఘుబాబు తదితరులు నటించారు. సినిమా అధిక భాగం న్యూజిలాండ్‌లో చిత్రీకరించబడింది. అనేక వాయిదాల తర్వాత చివరకు జూన్ 27న థియేటర్లలో విడుదలైంది. ఓటీటీ రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. సెప్టెంబర్ 4 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
కన్నప్ప సినిమా థియేటర్లలో ఓ మోస్తరు విజయం సాధించింది. అయితే ఈ సినిమా ఓటీటీ విడుదలపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సాధారణంగా సినిమా విడుదలై 7-8 వారాల వ్యవధిలో ఓటీటీలోకి వచ్చేస్తుంది. అయితే కన్నప్ప విడుదలై దాదాపు 10 వారాలు గడుస్తున్నా ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ రాలేదు.ఎట్టకేలకి ఈ రోజు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మూవీని థియేటర్స్‌లో మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా ప్రభాస్ కోసం ఈ మూవీని ఎక్కువగా చూసే ఛాన్స్ ఉంది.