Anushka Shetty | టాలీవుడ్ భామ అనుష్కా శెట్టి (Anushka Shetty) లీడ్ రోల్లో నటిస్తున్నపాన్ ఇండియా చిత్రం ఘాటి (Ghaati). క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. వేదం తర్వాత క్రిష్, అనుష్క కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్న అనుష్క టీంతో టాలీవుడ్ రానా కూడా జాయిన్ అయ్యాడు. ఈ ఇద్దరు ఫోన్ కాల్ ద్వారా ఆఫ్‌లైన్ ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నారు.
క్రిష్‌తో యాక్షన్ సినిమా చేశావంట.. చాలా వైల్డ్‌గా ఉంది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉందని స్వీటీతో అంటున్న మాటలతో రానా ఫోన్ కాల్ మొదలైంది. ఇంత వయోలెన్స్ (హింస)తో బాహుబలి, అరుంధతి తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ మళ్లీ ఇదేనంది స్వీటీ. ఇలాంటి కథకు మిమ్మల్ని కాకుంటే వేరే ఎవరిని పెడతారు వాళ్లకు వేరే ఆప్షన్లేమీ ఉండవు కదా.. అని అన్నాడు రానా. మరోవైపు అనుష్క మాట్లాడుతూ హిట్ మ్యాన్ ఉంటది కదా నేను హిట్ ఉమెన్ అయిపోవచ్చా అని క్రిష్‌ను పొద్దునే ఫోన్ చేసి అడిగానంది.
ఇక ఘాటిలో వయోలెన్స్ పక్కనే పెడితే ఇప్పుడు పరిస్థితులకు సెట్ అయ్యే పర్ఫెక్ట్ కథ. ఆంధ్రా-ఒడిశా బార్డర్ బ్యాక్ డ్రాప్లో జరిగే కథ ఇది. ఇది గంజాయి మొక్కలు పెంచే తెగ గురించి సాగే కథ. ఈ తెగకు చెందిన షీలా అనే మహిళ నేరస్థురాలిగా ఎలా మారిందనే నేపథ్యంలో సినిమా ఉంటుందని చెప్పింది స్వీటీ. ఆమె తన తప్పులను తెలుసుకుని ఒక లెజెండ్‌గా ఎలా ఎదిగిందనే నేపథ్యంలో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చింది. రానా, అనుష్క మధ్య జరిగిన సంభాషణ ఘాటి సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చైతన్య రావ్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఘాటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో పోస్ట్ థ్రియాట్రికల్ రిలీజ్ కానుంది.
ఫోన్లో రానా, అనుష్క చిట్‌చాట్ సాగిందిలా..
Vada Chennai 2 | వడ చెన్నై 2 వచ్చేస్తుంది.. క్రేజీ సీక్వెల్‌పై వెట్రిమారన్ ఏమన్నాడంటే..?
Game Changer Editor | డైరెక్టర్‌గా గేమ్ ఛేంజర్ ఎడిటర్.. స్టార్ హీరో సినిమాతో గ్రాండ్ ఎంట్రీ..!