లక్ష్మీదేవిపల్లి, సెప్టెంబర్ 01 : లక్ష్మీదేవిపల్లి మండలంలోని హేమచంద్రపురం గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ ముర్రేడు వాగులో చిక్కుకుంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి ముర్రేడువాగులో వరద నీరు భారీగా చేరింది. అయితే గత రెండు రోజుల క్రితం చెత్త డంపింగ్ చేయడానికి ముర్రేడు వాగు దగ్గరికి వెళ్లిన ట్రాక్టర్ ఇంజన్ మొరాయించడంతో ట్రాక్టర్ ఇంజన్, ట్రక్కును అక్కడే వదిలేసి గ్రామ సిబ్బంది వచ్చేశారు. సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వరద నీరు భారీగా రావడంతో వాగులో ట్రాక్టర్ ఇంజన్, ట్రక్కు చిక్కుకున్నాయి. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Laxmidevipally : అధికారుల నిర్లక్ష్యం.. వాగులో గ్రామ పంచాయతీ ట్రాక్టర్