డిస్పూర్ : అసోంలోని తిరుగుబాటు సంస్థ దిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ)కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలో అసోం రైఫిల్స్, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. ఆదివారం తెల్లవారు జామున ధనసిరి ప్రాంతంలోని అసోం-నాగాలాండ్ సరిహద్దు వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో డీఎన్ఎల్ఏకు చెందిన ఆరుగురు మృతి చెందగా.. సంఘటనా స్థలం వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అసోం స్పెషల్ పోలీస్ డైరెక్టర్ జనరల్ జీపీ సింగ్ ట్వీట్ చేశారు. నాలుగు ఏకే-47, మరో నాలుగు తుపాకులు, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, ఆయుధ సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్లో కార్బి ఆంగ్లాంగ్, దిమా హసావో జిల్లా పోలీసులు బృందాలు పాల్గొన్నాయి. సరిహద్దుల్లో డీఎన్ఎల్ఏ సహ ఇతర ఉగ్రమూకల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
In an early morning operation by @assampolice and Assam Rifles, six DNLA terrorists were neutralised in Dhansiri area of Karbi Anglong district. Large cache of arms & ammunition also recovered. @adgpi
— GP Singh (@gpsinghips) May 23, 2021